BSNL సేవలు పునరుద్ధరణ.. అన్ని రకాల సేవలు అందుబాటులోకి
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బీఎస్ఎన్ఎల్ సేవలను అధికారులు ఎట్టకేలకు పునరుద్దరించారు..
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బీఎస్ఎన్ఎల్ సేవలను అధికారులు ఎట్టకేలకు పునరుద్దరించారు. సుమారు తొమ్మిది రోజుల పాటు శ్రమించిన అధికారులు వినియోగదారులకు అందిస్తున్న అన్ని రకాల సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. ఈ నెల 22న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో జరిగిన ఈ ప్రమాదంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దీంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో బీఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగినందుకు కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ అధికారులు పలు రాయితీలను ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలకు మార్చి నెలలో 50 శాతం బిల్లు తగ్గించడంతోపాటు ప్రీపెయిడ్ కస్టమర్లకు రీఛార్జి సేవల వ్యాలిడిటీని ఎనిమిది రోజులు పొడిగించారు. కస్టమర్లు ఎవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే బీఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయని అధికారులు తెలిపారు.
దిశ, కరీంనగర్ బ్యూరో : అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బీఎస్ఎన్ఎల్ సేవలను అధికారులు ఎట్టకేలకు పునరుద్దరించారు. దాదాపు తొమ్మిది రోజుల పాటు శ్రమించిన అధికారులు వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న అన్ని రకాల సేవలను పునరుద్ధరించినట్లు ప్రకటించారు. అయితే తొమ్మిది రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగినందుకు కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ అధికారులు పలు రాయితీలను ప్రకటించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలకు మార్చి నెలలో 50శాతం బిల్లు తగ్గించడంతోపాటు ఫ్రీపెయిడ్ కస్టమర్లకు రిచార్జీ సేవల వ్యాలిడిటీని ఎనిమిది రోజులు పొడిగించారు.
షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం..
కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఈ నెల 22న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.2కోట్ల ఆస్తినష్టం జరిగింది. దీంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో బీఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ల్యాండ్ ఫోన్లు, బ్రాడ్ బ్యాండ్ సేవలు, ఫైబర్ సేవలతోపాటు సెల్ ఫోన్ ప్రీ పెయిడ్, పోస్ట్ ఫెయిడ్ సిగ్నళ్లు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పరిధిలోని నాలుగు జిల్లాల్లో 3,724 ల్యాండ్ ఫోన్లు, 6.751 ఫైబర్ టూ హోం కనెక్షన్లు, 179 ఓఎల్టీటీలు 2,61,515 సెల్‌ఫోన్ ప్రీ ఫెయిడ్ వినియోగదారులతో పాటు 1,270మంది సెల్ ఫోన్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఉన్నారు. అగ్ని ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని అన్ని పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో నాలుగు జిల్లాలకు సేవలు నిలిచిపోయాయి.
పూర్తయిన పునరుద్దరణ పనులు..
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో ఈ నెల 23 నుంచి అధికారులు పునరుద్దరణ పనులు చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ వరంగల్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, కరీంనగర్ డీజీఎం దినేష్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. పునరుద్దరణకు కావాల్సిన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పరికరాలు తెప్పించి బీఎస్ఎన్ఎల్ సేవలను ఎట్టకేలకు పునరుద్ధరించారు. గురువారం నాటికి 95శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. మార్చి 31 సాయంత్రం వరకు అన్ని రకాల సేవలను పునరుద్దరిస్తామని తెలిపారు.
మార్చి బిల్లులో 50శాతం మాఫీ..
కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ సేవలకు 8రోజుల పాటు అంతరాయం కలుగడంతో వినియోదారులకు సంస్థ పలు రాయితీలు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న అన్ని రకాల సర్వీస్‌లపై మార్చి నెల బిల్లులో 50శాతం తగ్గిస్తామని బీఎస్ఎన్ఎల్ వరంగల్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి తెలిపారు. సెల్ ఫోన్ వినియోదారులైన ప్రీ పెయిడ్ కస్టమర్లకు 8రోజుల అదనపు వ్యాలిడిటీ పెంచుతామని తెలిపారు. నిర్ణిత సమయం తరువాత మరో ఎనిమిది రోజులు యాదావిధిగా కొనసాగుతాయని చంద్రమౌళి తెలిపారు. రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించామని ఎవరూ బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు రాకుండానే బీఎస్ఎన్ఎల్ తీసుకున్న నిర్ణయాలు అమలవుతాయని చంద్రమౌళి తెలిపారు.