monkeys : వామ్మో.. వానర సంచారం...

ఒకప్పుడు కోతి కనబడిందంటే వయసుతో తేడా లేకుండా అందరూ బయటకు వచ్చి చూస్తుండేవారు.

Update: 2024-11-05 08:18 GMT

దిశ, రామడుగు : ఒకప్పుడు కోతి కనబడిందంటే వయసుతో తేడా లేకుండా అందరూ బయటకు వచ్చి చూస్తుండేవారు. అదేవిధంగా చిందులాడించే వ్యక్తి కోతిని పట్టుకొని వాడవాడలా ఓ గమ్మత్తైన ఆట నేర్పిస్తూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని జీవనం గడుపుతుండే రోజులు. అప్పుడు కోతిని చూసేందుకై ప్రజలు కూడా ఆసక్తి కనబరిచేవారు. కానీ ఇప్పుడు అదే కోతుల వల్ల ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం పై దిశ ప్రత్యేక కథనం. వివరాల్లోకి వెళితే రామడుగు మండల కేంద్రంలో వానరసంచారం ఒక మందల గుంపు తయారై ప్రతి ఇల్లును చిందరవందర చేస్తూ ప్రజల్లో బాంబేలు ఎత్తిస్తున్న పరిస్థితి ఏర్పడింది.

ఒకటా రెండా వందల సంఖ్యలో ఒకే మారు గుంపులుగా ఇండ్ల పై దాడులు చేస్తూ మనుషుల పైపైకి వచ్చి దాడులు చేస్తుండడంతో ప్రజలు ఏమి చేయలేకపోతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చుట్టుపక్కల ఉన్న గుట్టల్లో క్రషరు గ్రానైట్ రకరకాల మిషనరీలు వాడకంతో పాటు బాంబులు పెట్టడం కోతులకు అడవి ప్రాంతం ఆవాసాలను వదిలి నివాసాలకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతుండడం గమనార్హం. ప్రతిరోజు ప్రతి ఇల్లును చిందరవందర చేస్తూ ఇంట్లో ఎగబడి తినే అన్నం గంజుల నుండి రకరకాల వంటిల్లు సామాగ్రిని ఎత్తుకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉన్నప్పటి నుండి ప్రజలు గగ్గోలు పెట్టినా ఎవరు పట్టించుకోలేకపోవడంతో కనీసం అధికార యంత్రమైన ఈ కోతుల బెడద నుండి కాపాడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News