నిరంకుశత్వంపై పోరాడిన యోధుడు పాపన్న గౌడ్

తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వంపై పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-08-18 09:56 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తెలంగాణ ప్రాంతంలో నిరంకుశత్వంపై పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, జిల్లా కేంద్రంలోని మొదటి బైపాస్ లోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యంగా గౌడన్నల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కుల వృత్తులపై ఆధారపడ్డ గౌడన్నల కోసం శుక్ల పన్నులను రద్దు చేసి, పాత బకాయిలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

     వైన్స్ షాపులలో 15 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. నీరా ఫాలసీని ప్రోత్సహిస్తూ ట్యాంక్ బండ్ వద్ద నీరా కేఫ్ ఏర్పాటు చేసి, నీరా ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా తెలిపామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కి పైగా బీసీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేసి, అందులో బీసీ విద్యార్థులందరికీ అవకాశం కల్పించామన్నారు. ట్యాంక్ బండ్ పైన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టాలని, అంతేకాకుండా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పాపన్న గౌడ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News