Theft : మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ

ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు.

Update: 2024-10-31 08:01 GMT

దిశ, కరీంనగర్ రూరల్ : ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కరీంనగర్ మండలంలో నెల వ్యవధిలోనే వరుస దొంగతనాలు జరుగుతుండడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ మండలంలోని గోపాలపురం శివారు ప్రాంతంలో వాగు ఒడ్డున కొలువైన మల్లికార్జున స్వామి దేవాలయంలో (గురువారం) తెల్లవారుజామున కొందరు దుండగులు చొరబడి హుండీ పెట్టను దొంగలించారు.ఈ సంఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News