‘ఖని’లో బెల్ట్ జోరు.. 200 పైగా బెల్టు షాపులు
గోదావరిఖనిలో పారిశ్రామిక ప్రాంతంలో బెల్ట్ షాపులు వాడవాడలా రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపుల దంద జోరుగా కొనసాగుతుంది.
దిశ, గోదావరిఖని: గోదావరిఖనిలో పారిశ్రామిక ప్రాంతంలో బెల్ట్ షాపులు వాడవాడలా రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతోంది. జోరుగా బెల్ట్ దుకాణాల్లో మద్యం వ్యాపారం ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం ఏంటని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే విధంగా మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలు పనిచేస్తున్నాయని అనుకుంటున్నారు.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు..
బెల్ట్ షాపుల దందా రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా వాడవాడలా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు అనుకుంటున్నారు. మద్యం ప్రియులు బెల్ట్ షాపులో అతిగా మద్యం సేవించి రోడ్ల మీదనే పడిపోతున్నారు. అందరూ అతిగా మద్యం సేవించి చనిపోయిన ఘటనలు కూడా గోదావరిఖనిలో చోటు చేసుకున్నాయి. మహిళలకు,కాలేజీ విద్యార్థు లు బెల్ట్ షాపులతో ఇబ్బంది ఏర్పడుతుందని అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది.
ఖనిలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారా.. లేరా..?
గోదావరిఖనిలో బెల్ట్ షాపులు విచ్చల విడిగా వ్యాపారం కొనసాగిస్తున్నా గోదావరిఖనిలో అసలు ఎక్సైజ్ అధికారులు ఉన్నారా! లేరా! అని స్థానిక ప్రజల్లో సందేహం ఏర్పడుతున్నది. బెల్ట్ షాపుల నుంచి ఎక్సైజ్ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టడం వల్లే పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపులకు సరఫరా
గోదావరిఖనిలో చుట్టుపక్కల గ్రామాలు కలుపుకొని 200 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. మద్యం దుకాణాలను నుంచి చుట్టుపక్కల గ్రామాలకు జనగామ,సుందిళ్ల, 8 ఇంక్లైన్ కాలనీ ఎలుకల పెళ్లి గ్రామాలకు మద్యం దుకాణాల నుంచి మద్యం సరఫరా చేస్తున్నారని , చుట్టుపక్కల గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు కిరాణా షాపులలో, చిన్న చిన్న దుకాణాలలో సైతం అమ్ముతున్నారు.
మద్యం షాపుల పక్కనే సెట్టింగులు
గోదావరి ఖని లో మద్యం షాపుల పక్కన పర్మిట్ లేని రూములలో సిట్టింగ్లు ఏర్పాటు చేసి మద్యం దుకాణం నుండి బెల్ట్ యజమానులు కొనుగోలు చేసి జోరుగా అమ్మకాలు చేస్తున్నారని స్థానికులు అనుకుంటున్నారు.
ఎలుకల పల్లి లో జోరుగా బెల్టుషాపులు
ఎలకలపల్లి గేటు వద్ద బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతుందని స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. బెల్ట్ యాజమాన్యం వారు ప్రత్యేకమైన రూములు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని.. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు గేటు వైపు పోకపోవడం అందరికీ సందేహం కలుగుతుంది. ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల నుంచి నెల నెల భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నాయని అనుకుంటున్నారు. ఏది ఏమైనా బెల్ట్ షాపులను అరికట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.