కోరుట్ల నర్సరీ అందాలకు మంత్రి కేటిఆర్ ఫిదా
కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముగ్ధులయ్యారు.
దిశ, కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీ అందాలకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముగ్ధులయ్యారు. నర్సరీ ఫోటోలను తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో శనివారం రాత్రి పోస్ట్ చేసి 'ఈ అందమైన ఫోటోలు ఎక్కడ నుండి వచ్చాయో ఊహించండి' అంటూ నెటిజన్లను మంత్రి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో విరబూసిన గులాబీలు అంటూ తానే సమాధానం ఇచ్చారు. కోరుట్ల నర్సరీ లాగే రాష్ట్ర పురపాలక పట్టాభివృద్ధిశాఖ శాఖ తెలంగాణలోని 141 పట్టణాల్లో 1012 నర్సరీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరో 600 నర్సరీ లు ఉన్నాయని తెలిపారు. గ్రేట్ జాబ్ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గారు.. మంచి పనిని కొనసాగించండి అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ అభినందించారు.