కార్మికులకు షాకిచ్చిన క్యాంటీన్ సిబ్బంది..

టిఫిన్ చేసేందుకు వచ్చిన కార్మికులకు క్యాంటీన్ సిబ్బంది షాకిచ్చారు.

Update: 2023-05-26 10:09 GMT

దిశ, గోదావరి ఖని : టిఫిన్ చేసేందుకు వచ్చిన కార్మికులకు క్యాంటీన్ సిబ్బంది షాకిచ్చారు. కార్మికుడు ఆర్డర్ చేసిన ఫుడ్ తో పాటు చచ్చిన బల్లిని సర్వ్ చేశారు. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ ఘటన గోదావరిఖనిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గోదావరిఖని పదకొండవ గనిలో ఉదయం షిఫ్ట్ కి వెళ్ళిన కార్మికులు శుక్రవారం క్యాంటీన్ వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేశారు.

కాసేపటికి క్యాంటీన్ సిబ్బంది ఇడ్లీ సాంబార్ సర్వ్ చేశారు. సగం తిన్న తర్వాత కార్మికునికి భయంకరమైన అనుభవం ఎదురైంది. తాను తింటున్న ఇడ్లీ ప్లేటులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది. దీంతో కార్మికులు క్యాంటీన్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. జీఎంకు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు. కార్మిక సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి కార్మికుల పట్ల యాజమాన్యం ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు.

Tags:    

Similar News