ఎవ్వరినీ వదిలిపెట్టం

సిరిసిల్లలో భారీ భూ కుంభకోణం జరిగిందని ప్రతికల్లో పెద్దపెద్ద అక్షరాలతో రాస్తున్నారని, తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాపై ధ్వజమెత్తారు.

Update: 2025-01-04 10:16 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో భారీ భూ కుంభకోణం జరిగిందని ప్రతికల్లో పెద్దపెద్ద అక్షరాలతో రాస్తున్నారని, తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాపై ధ్వజమెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

     బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని కొందరు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారని పత్రికా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని, తమ లీగల్ విభాగం ద్వారా పత్రికా ప్రతినిధులపై పరువు నష్టం దావా వేసి హైకోర్టుకు లాగుతమన్నారు.  


Similar News