జగిత్యాలలో దంచి కొట్టిన వాన.. చెరువును తలపిస్తున్న రోడ్డు

శుక్రవారం తెల్లవారుజామున జగిత్యాలలో వర్షం దంచి కొట్టింది.

Update: 2024-08-30 05:18 GMT

దిశ, జగిత్యాల టౌన్ : శుక్రవారం తెల్లవారుజామున జగిత్యాలలో వర్షం దంచి కొట్టింది. సుమారు రెండు గంటల పాటు పడిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని పలు వార్డులలో డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు చల్ గల్ శివారులోని జగిత్యాల నిజామాబాద్ ప్రధాన రహదారిపై చెరువును తలపించేలా వరద నీరు రోడ్డుపై ప్రవహించింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా పారిశుద్ధ్య పనులు ఎక్కడికి అక్కడే తాత్కాలికంగా నిలిచిపోయాయి. అసలే విష జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో వర్షం కారణంగా శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పట్టణ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.




Similar News