నాయకులకే వ్యతిరేకం కార్యకర్తలకు కాదు
ప్రతి పక్ష నాయకులకే తాను వ్యతిరేకం అని కార్యకర్తలకు కాదు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
దిశ, కొడిమ్యాల: ప్రతి పక్ష నాయకులకే తాను వ్యతిరేకం అని కార్యకర్తలకు కాదు అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా హిత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాము ప్రజల పక్షాన నిలిచి పోరాడితే అక్రమ కేసులో ఇరికించి జైల్లో పెట్టినప్పటికీ వెనకడుగు వేయలేదని అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అని అన్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పని కోసం కేటాయించే పై ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవే, గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్ని విపత్తులు ఎదురైన ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి కంటికి రెప్పలా కాపాడు కుంటున్నాడని మళ్ళీ ఇంకో సారి మనం అవకాశం ఇచ్చి మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి ని చేయాలని, తనను రెండో సారి ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, బొడిగే శోభ,రవీందర్ రెడ్డి, పద్మ తదితరులు పాల్గొన్నారు.