మోడీ ప్రధాని అయినా పర్వాలేదు కానీ వినోద్ కుమార్‌ను ఎంపీగా గెలిపించాలి
శంకరపట్నం మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
దిశ, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై మాట్లాడుతూ... గత గాయాలను మరిచిపోవడానికి, మన ముందు ఒక గొప్ప అవకాశం ఉంది అది , కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్‌ను ఎంపీగా గెలిపించుకుంటే ఓటమికి ప్రతి కారము తీర్చుకున్నట్లుగా ఉంటుంది అని రసమయి అన్నారు. గులాబీ జెండాకు ఓటమి రుచి తెలుసు గెలుపు రుచి కూడా తెలుసు తన ఓటమి కొంత బాధించిన కూడా సంతోషాన్ని కూడా ఇచ్చింది. నా అనేవారు ఎవరు అనేది కూడా తెలిసింది. మన చేతగానితనాన్ని ఇతరులపై నెట్టి వేయకూడదు.
కవ్వంపల్లి గెలవాలి అనే తపనతో 20 సంవత్సరాలు ఆరాటపడి అవమానాలు పడ్డాడు. 20 సంవత్సరాల కాలంలో గ్రామానికి ఒకరిద్దరు, అక్కడక్కడ కార్యకర్తల ను పెరిగే లాగా చేసుకున్నాడు. మనము పంట పండించుకుంటే , ఈరోజు పరిగె పంట అయినది పంట పరిగె అయింది. మన అలసత్వమే ఓటమికి దారితీసింది. మనము అన్ని రకాలుగా అభివృద్ధి చేశాము. మనకే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకున్నాము. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మార్పు మన ఓటమికి కారణం అయింది. ఆరు గ్యారెంటీల వెనుక 420 అబద్ధాలు చెప్పారు. 6 గ్యారంటీలు కూడా అమలు అయ్యే గ్యారెంటీలు కాదు గుట్టకు ఏంటిక కట్టినం వస్తే గుట్ట పోతే ఎంటిక, అన్నట్లు ఆరు గ్యారెంటీల అమలు సాధ్యం అయ్యే విషయం కాదు అన్నారు.
ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అన్నారు. రేపో మాపో ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తారన్నారు. గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కాలేదన్నారు. రేవంత్ రెడ్డికి దేనిమీద అవగాహన లేదు. ఓసారి ముఖ్యమంత్రి కావాలని అబద్దాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అనేవారు పేగులు మెడలో వేసుకొని తిరుగుతారా..? రక్తం తాగుతా అనే భాష ఏ ముఖ్యమంత్రి ఇప్పటివరకు మాట్లాడలేదని అన్నారు. పచ్చని పంట పొలాలు పశువుల మేతగా మారిపోయాయి అని అన్నారు. 100 రోజుల్లో పచ్చని పంట పొలాల్లో పల్లేర్లు మొలిసేలా కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు తీసుకు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ భ్రమలు ప్రజలలో అని ఇక బీఆర్ఎస్ లీడర్లకు తొలగిపోవాలని మళ్లీ కారు గుర్తుకే ఓటువేస్తామనే రోజులు గ్రామంలో వచ్చాయన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తేయాలే పంటలను ఎండబెట్టాలే పంటలు ఎండబెడితే బోనస్ ఇవ్వడం తప్పుతుందన్నారు.
పొలాలను ఎండబెట్టాలనే కుట్ర జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అని చెప్పుకునే పరిస్థితి కూడా గ్రామంలో ఉండదన్నారు కాంగ్రెస్ కార్యకర్తలను సభాముఖంగా అభినందించిన రసమయి బాలకిషన్ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇది కావాలి అని నన్ను అడగలేదు అన్నారు. అధికారం వచ్చేదాకా కొట్లాడారు, వెంబడి ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ గురించి కార్యకర్తలు చులకనగా మాట్లాడకూడదని హితవు పలికాడు. రేపటి భవిష్యత్ మనదే తెలంగాణ పట్ల కేసీఆర్‌కు తండ్రి పాత్ర ఉంటుంది అని కేసీఆర్ అభివృద్ధి జరగాలని కోరుకుంటాడు అని అన్నారు.
నేను స్థానికంగానే గుండారంలో ఉంటున్నాను. మంచికి చెడుకు అన్నింటికీ నేను వస్తాను. నేను ఎక్కడికి పోలే నాకు భవిష్యత్తు మీద నమ్మకం ఉంది మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా మంత్రిని అవుతా రాసి పెట్టుకోండి స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు అని అన్నారు. రాహుల్ గాంధీ చెల్లని రూపాయిగా మారిపోయాడన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా పర్వాలేదు కానీ, వినోద్ కుమార్ మాత్రం ఎంపీగా గెలవాలని ప్రజలు అంటున్నారని అన్నారు. బండి సంజయ్ ఐదు సంవత్సరాల కొకసారి ప్రజా యాత్ర అని మొదలు పెడతాడు, మళ్లీ తర్వాత కనిపించడు. ఎంపీగా వినోద్ కుమార్ గెలుస్తాడు నేనే ఒక కోటి రూపాయలను ఎంపీ నిధుల నుండి తీసుకు వస్తాను , ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తాం అని అన్నాడు.