ఎడారి దేశంలో… ఎదురుచూపులు

ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకు దెరువు కోసం ఎడారి దేశం వలస వెళ్లి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న గల్ఫ్ అన్న కల్లూరి మోహన్ కి ఆపన్న హస్తం అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

Update: 2024-10-08 08:35 GMT

దిశ, కోనరావుపేట ; ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకు దెరువు కోసం ఎడారి దేశం వలస వెళ్లి.. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న గల్ఫ్ అన్న కల్లూరి మోహన్ కి ప్రభుత్వ విప్ ఆది ఆపన్న హస్తం అందించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని కొలనూరు గ్రామానికి చెందిన కల్లూరు మోహన్ (35) s/o లక్ష్మీరాజ్యం ఉన్న ఊరిలో ఉపాధి లేక, అప్పుల బాధలు తాళలేక ఉన్న ఇల్లు అమ్ముకొని పరాయి దేశం బాటపట్టాడు. కుటుంబాన్ని పోషించుకుంటూ కాలం వెళ్లదీసుకుంటూ వస్తున్న ఆ యువకుడిని విధి వక్రించింది. మలేషియాలో కూడా ఉపాధి కరువవడంతో మనస్థాపానికి చెంది, ఆరోగ్యం క్షీణించి దారుణ పరిస్థితులను వెళ్లదీస్తూ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళాడు.

గల్ఫ్ మిత్రుల ద్వారా మోహన్ పరిస్థితి తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆది శ్రీనివాస్ కల్లూరి మోహన్ దీనస్థితిని అర్థం చేసుకొని కల్లూరి మోహన్ అనే వ్యక్తిని వెంటనే స్వదేశానికి పంపించాలని,తనకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తరపున మలేషియాలోని ఇండియన్ ఎంబసీకి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. మోహన్ స్వదేశానికి రావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ కి కోలనూరు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


Similar News