MLA : కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు

గ్రామపంచాయతీల ద్వారానే అభివృద్ధితో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

Update: 2024-10-08 09:45 GMT

దిశ, జగిత్యాల రూరల్ : గ్రామపంచాయతీల ద్వారానే అభివృద్ధితో పాటు ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. హబ్సిపూర్, సంగంపల్లి గ్రామాలలో నూతన జిపి భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సర్పంచుల పాలనను మరిపించేలా స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండాలని గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. దసరా,బతుకమ్మ పండుగల ఏర్పాట్లు లో ఎలాంటి లోటు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా తిప్పన్నపేట్ గ్రామం లో రూ. 20 లక్షలతో నిర్మించ తలపెట్టిన పల్లె దవాఖానకు భూమి పూజ చేశారు. విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాలలో నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు, గ్రామస్తులతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News