Etela Rajender : నేల విడిచి సాము చేసిన ఈటల

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రస్తుత పరిస్థితి ను చూస్తే నేల

Update: 2023-12-03 06:16 GMT
Etela Rajender : నేల విడిచి సాము చేసిన ఈటల
  • whatsapp icon

దిశ,హుజురాబాద్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రస్తుత పరిస్థితి ను చూస్తే నేల విడిచి సాము చేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ కు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ తో పాటుగా గజ్వేల్ లో పోటీ చేయడం ఈటలకు శాపంగా మారిందని పరిశీలకులు అంటున్నారు. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లో పోటీ చేసిన ఈటల ఎక్కువగా గజ్వేల్ పై ఫోకస్ చేయడంతో హుజూరాబాద్ లో ఈటల భార్య జమున ప్రచారం నిర్వహించడం కార్యకర్తల్లో ఈటల హుజురాబాద్ ను విడిచి గజ్వేల్ కు వెళ్తున్నాడనే ప్రచారం జరిగింది .దీంతో ఈటలకు బదులుగా ఓటర్లు ప్రత్యామ్నాయంగా ప్రణవ్ ను ఎన్నుకున్నారు.

దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇద్దరికీ చీలడంతో కౌశిక్ రెడ్డి ఈజీగా బయటపడుతున్నట్లు కనిపిస్తుంది.కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ కు ధీటుగా తన భార్య షాలిని,కూతురు ను ప్రచారం లోకి దించడం,వారు కౌశిక్ ఊహించిన దాని కంటే ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లి ప్రచారం చేయడం,ఎక్కువగా మహిళల మనసు దోచుకోవడం తో ఓటింగ్ శాతం ఇక్కడ బీఆర్ఎస్ కు ఎక్కువ నమోదు కావడం అని భావిస్తున్నారు. ఈటల ను తన అతి విశ్వాసమే కొంప ముంచినట్లయింది పలువురు ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News