నిజాయితీని చాటిన కోరుట్ల యువకులు

పట్టణంలోని కల్లూరు రోడ్డులో ఉన్న మణికంఠ వినోద్ ఫోటో స్టూడియోలో పని చేసే ఎల్లసాయి, ధామ రాకేష్ లకు సమీపంలోని పాత ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద బుధవారం ఉదయం గులాబీ రంగులో ఉన్న పర్సు దొరకింది.

Update: 2023-05-17 11:17 GMT

దొరికిన 3 తులాల బంగారు నగలు పోలీసులకు అప్పగింత

దిశ, కోరుట్ల : పట్టణంలోని కల్లూరు రోడ్డులో ఉన్న మణికంఠ వినోద్ ఫోటో స్టూడియోలో పని చేసే ఎల్లసాయి, ధామ రాకేష్ లకు సమీపంలోని పాత ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద బుధవారం ఉదయం గులాబీ రంగులో ఉన్న పర్సు దొరకింది. తీరా అందులో చూస్తే.. రెండు తులాల బంగారు నక్లెస్, ఒక తులం బిస్కెట్ బంగారం, రూ.వెయ్యి నగదు ఉన్నాయి. ఎవరో పర్సు పోగొట్టుకొని ఉంటారని.. దొరికిన పర్సును సంబంధీకులకు అప్పగించాలని భావించి తమ ఫోటో స్టూడియో యజమాని చలిగంటి వినోద్ కు విషయాన్ని తెలిపారు.

ఆయన కోరుట్ల ఎస్ఐ సతీష్ కు సమాచారం అందజేశారు. అనంతరం పాత ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి పర్స్ పోగొట్టుకున్న మెట్ పల్లి పట్టణానికి చెందిన సంబంధిత వ్యక్తులను గుర్తించి వారికి ఎస్ఐ సతీష్ సమాచారం అందజేశారు. సమాచారం తెలుసుకున్న బాధితురాలు ధనలక్ష్మి కోరుట్ల పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐని కలిసి, బాధితురాలి ఆధారాలు పరిశీలించిన అనంతరం పర్స్ ను అమెకు అందజేశారు.

అనంతరం ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ.. తమకు దొరికిన బంగారం ఉన్న పర్సును నిజాయితీగా సంబంధిత యజమానులకు అందజేయాలనే వచ్చిన ఎల్లసాయి, దామ రాకేష్ లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాలువాతో ఇద్దరిని సత్కరించి, యువత సమాజంలో మంచి పనులు చేయడంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, పాత్రికేయులు చలిగంటి వినోద్, గోరు మంతుల నారాయణ పాల్గొన్నారు.

Also Read..

చలివేంద్రాలు మళ్లీ షురూ... దిశ ఎఫెక్ట్ 

Tags:    

Similar News