వరద కాల్వను అనుకోని భారీగా ఇసుక డంపులు

ఓ వైపు ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదని

Update: 2024-10-03 09:58 GMT

దిశ, కథలాపూర్ : ఓ వైపు ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదని ఆదేశాలిస్తుంటే కథలాపూర్ మండలంలో మాత్రం అవేం తమకు పట్టవన్నట్టు ఇసుక వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. బొమ్మేనా వాగు నుంచి ఇసుకను తరలించి మండలాన్ని అనుకోని ఉన్న దుంపేట వరదకాల్వను అనుకోని ఇసుక అక్రమార్కులు భారీగా ఇసుక డంపులు ఇసుక నిల్వలు చేస్తున్నారు. అక్రమ వ్యాపారస్తులు రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.

ఇసుక తరలించాలంటే ఇటీవల జిల్లా కలెక్టర్ మన ఇసుక వాహనం ద్వారా ఇసుక నమోదు చేసుకోవాలని ఆదేశించిన పట్టించుకోక పోవడంతో ఇటు మైనింగ్ శాఖ గానీ, అటు రెవెన్యూ శాఖ గానీ కన్నెత్తి చూడకపోవడంతో అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కనక వర్షం కురిపిస్తుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు గాని ఇటువైపు కన్నెత్తి చూడక పోవడంతో ఇసుక అక్రమార్కులకు కొమ్ముకాస్తురనే అనుమానం రాక మానదు.మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఇసుక డంపులు ఉన్న వాటిపై ఇప్పటివరకు అధికారులకు సమాచారం లేదా లేక వారి కనుసన్నల్లోనే జరుగుతుందా అని ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని అక్రమ ఇసుక వ్యాపారాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.


Similar News