వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఒక్కేసి పువ్వేసి చందమామ...ఒక్క జాములై సందమామ... చూడ జాములై సందమామ.. శివుడు రాకపై సందమామ.... అంటూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం హోరెత్తింది.

Update: 2024-10-08 16:30 GMT

దిశ, వేములవాడ : ఒక్కేసి పువ్వేసి చందమామ...ఒక్క జాములై సందమామ... చూడ జాములై సందమామ.. శివుడు రాకపై సందమామ.... అంటూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం హోరెత్తింది. తెలంగాణ ప్రత్యేక పండుగైనా బతుకమ్మ పండుగ వేడుకలు మంగళవారం వేములవాడ పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు భిన్నంగా సప్త రాశుల ఆధారంగా ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ క్రమంలో పట్టణములోని వివిధ ప్రాంతాల నుండి మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో తరలివచ్చి మూలవాగులో ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్ద బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. దీంతో పట్టణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోయింది. బతుకమ్మ తెప్ప వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మూల వాగు కాస్త పూల వాగుగా మారింది.


మొట్టమొదటిసారిగా ఈసారి వేడుకల్లో ఒగ్గుడోలు నృత్యాలు, మహిళా కళాకారునిల కోలాటం ఆటలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డిలు ఒగ్గుడోలు తో, కోలాటం ఆటలతో కాసేపు సందడి చేశారు. వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రి పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకల్లో జోష్ నింపారు. అంతకుముందు ఉదయం మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి శ్రీ దుర్గామాత అమ్మవారి వారి ఊరేగింపు కన్నులపండువగా కొనసాగింది. ఇదిలావుండగా వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి, పట్టణ సీఐ వీర ప్రసాద్ ల ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు భిన్నంగా వేములవాడ పట్టణములో జరిగిన 7 రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక కళాకారిణి విమలక్క, జెడ్పి మాజీ చైర్ పర్సన్ లు తుల ఉమా, న్యాలకొండ అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు, తోట అగయ్య తదితరులు హాజరయ్యారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు

వేములవాడలో 7రోజులకే జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, వైస్ చైర్మన్ బింగి మహేష్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మి నరసింహ రావు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, ఇప్పపూల అజయ్, నరాల శేఖర్, జయ-సలీం తదితరులు వేములవాడ మున్సిపల్ పరిధిలోని మహిళా సోదరీమణులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.


Similar News