ఫోరం సంచలన తీర్పు... వినియోగదారునికి రూ. 44 వేలు చెల్లించాలని ఆదేశం

వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేసిన వినియోగదారుడు అది పని చేయక పోవడంతో కరీంనగర్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయగా ఆయనకి రూ.44 వేలు, వకీలు ఫీజు కింద రూ. 5000 చెల్లించాలని కరీంనగర్ వినియోగదారుల హక్కుల ఫోరం తీర్పు చెప్పింది.

Update: 2024-11-08 13:06 GMT

దిశ, కరీంనగర్ లీగల్ : వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేసిన వినియోగదారుడు అది పని చేయక పోవడంతో కరీంనగర్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయగా ఆయనకి రూ.44 వేలు, వకీలు ఫీజు కింద రూ. 5000 చెల్లించాలని కరీంనగర్ వినియోగదారుల హక్కుల ఫోరం తీర్పు చెప్పింది. కరీంనగర్ బోయవాడకు చెందిన సందెబోయిన మనోజ్ బ్లూ స్టార్ వాటర్ ప్యూరిఫైయర్ను దాని అథరైజ్డ్ డీలర్ వద్ద రూ. 44 వేలు చెల్లించి 2019 సంవత్సరంలో కొనుగోలు చేశాడు.

    కాగా వారంటీ పిరియడ్ లోనే ప్యూరిఫైయర్ పాడైపోవడంతో పలు మార్లు కంపెనీకి, ఆథరైజ్డ్ డీలర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు. దాంతో న్యాయవాది ఉప్పుల మునిష్ ద్వారా కరీంనగర్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. కాగా ఇరు వర్గాల వాదనలు విన్న ఫోరం అధ్యక్షురాలు శ్రీలత, సభ్యుడు నరసింహారావు తక్షణమే వినియోగదారునికి రూ. 44 వేలు, వకీలు ఫీజు రూ.5 వేలు చెల్లించాలని ప్యూరిఫైయర్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. 


Similar News