కళాకారుడి అద్భుత కాళారూపం.. రూపాయి బిళ్ళ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రం..
రూపాయి బిళ్ళ మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రూపాన్ని చిత్రీకరించారు ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి.
దిశ, గొల్లపల్లి : రూపాయి బిళ్ళ మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రూపాన్ని చిత్రీకరించారు ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి. మండలంలోని రాఘవ పట్నం గ్రామానికి చెందిన చోళేశ్వర్ చారి రావి ఆకులు, బియ్యం గింజలు, సుద్ధముక్కల పైన వెయ్యికి పైగా శిల్పాలు చిత్రీకరించి రాష్ట్ర ప్రభుత్వంచే పలు అవార్డులు పొందారు.
కాగా తాజాగా మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చిత్రాన్ని రూపాయి బిళ్ళ మీద చిత్రీకరించి నివాళులర్పించాడు. ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి పథంలో నడిపించడానికి మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాగే ప్రధాన మంత్రిగా బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచారని అన్నారు. భారత దేశ ఆర్థిక శాస్త్రవేత్తగా డా.మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణకు చిహ్నంగా రూపాయి బిళ్ళ మీద వారి చిత్రాన్ని వేసినట్లు చారి తెలిపాడు.