ప్రశ్నార్థకంగా మారిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ రాజకీయం

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ ​అభ్యర్థుల పేర్లు ఇటీవల కేసీఆర్​ ప్రకటించగా మారోమారు రసమయి బాలకిషన్‌కు టికెట్​దక్కింది.

Update: 2023-08-28 02:59 GMT

దిశ, మానకొండూర్ : మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ ​అభ్యర్థుల పేర్లు ఇటీవల కేసీఆర్​ ప్రకటించగా మారోమారు రసమయి బాలకిషన్‌కు టికెట్​దక్కింది. దీంతో మానకొండూరు ​నియోజకవర్గంలో ఆరేపల్లి పయనం ఎటు వైపు అనే చర్చ సాగుతోంది. టికెట్లు డిక్లేర్​అయిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే మౌనంగా ఉన్నారు. దీంతో ఆరేపల్లి అస్సమ్మతి గళం వినిపిస్తారా..? లేక అధిష్టానం తో ఏదైనా తెచ్చుకుంటారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

నాలుగేళ్ల కింద కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ఆరేపల్లి మోహన్ మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్‌పై అనేక ఆశలు పెంచుకున్నారు. వినోద్​కుమార్ సిపారస్‌తో బీఆర్ఎస్ టికెట్​వస్తుందని ఆశించాడు. అయితే మొదటి జాబితాలో మోహన్ పేరు లేకపోవడంతో ఆయన అభిమానుల్లో నిరుత్సాహం నెలకొన్నది. ఆరేపల్లి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని నియోజకవర్గంలో అతని అనుచరులు, అభిమానులు, ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఆరేపల్లికి నిరాశే..

మానకొండూర్​ సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేరును ప్రకటించడంతో ఆరేపల్లి మోహన్‌కు నిరాశ మిగిలింది. టికెట్ పై ఆశలు పెట్టుకున్న మోహన్ పేరు అభ్యర్థుల జాబితాలో లేకపోవడంతో అతని రాజకీయ పయనం ఎటు వైపని నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. నాలుగు సంవత్సరాల కింద కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్‌ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ఆరేపల్లి మోహన్ మానకొండూర్ ఎమ్మెల్యే టికెట్‌పై అనేక ఆశలు పెంచుకున్నారు. వినోద్​ కుమార్​ సిపారస్‌తో బీఆర్ఎస్ టికెట్​ వస్తుందని ఆశించాడు. జాబితాలో మోహన్ పేరు లేకపోవడంతో మోహన్ అభిమానుల్లో నిరుత్సాహం నెలకొన్నది. ఆరేపల్లి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని నియోజకవర్గంలోని అతడి అనుచరులు, అభిమానులు ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కవ్వంపల్లికి మద్దతు ఇస్తారా?

బీఆర్ఎస్‌లో టికెట్ రాక తీవ్ర నిరుత్సాహంగా ఉన్న ఆరేపల్లి తిరిగి సొంత గూటికి చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కొందరు మోహన్ అభిమానులు కార్యకర్తలు సలహా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవ్వంపల్లి సత్యనారాయణ అనురాధ దంపతులు ఆరెపల్లి మోహన్ గెలుపు కోసం మద్దతు ఇచ్చి పని చేసినా మోహన్ ఓటమి చవి చూశారు. వచ్చే ఎన్నికల్లో కవ్వంపల్లి గెలుపునకు పని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉంటుందని కొందరు నాయకులు మోహన్‌కు సూచిస్తున్నట్లు సమాచారం.

మోహన్‌కు బీజేపీ గాలం..?

బీఆర్ఎస్ టికెట్ రాక నిరాశతో ఉన్న ఆరేపల్లి మోహన్‌కు బీజేపీ గాలం వేసినట్టు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మానకొండూర్​ నియోజవకర్గంలో సరైన అభ్యర్థి లేకపోవడంతో బీజేపీ అధిష్టానం మోహన్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. బీజేపీలో చేరితే పార్టీ టికెట్ ఇస్తామని బీజేపీ హైకమాండ్ ఆఫర్ చేసినట్లు తెలియ వచ్చింది. బీజేపీ ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మోహన్ అనుచరులు మాత్రం ఖండిస్తున్నారు. ఆరెపల్లి మోహన్​ బీఆర్ఎస్​ పార్టీ అధిష్టానంతో మాట్లాడి పార్టీలో కొనసాగుతారా..? ప్రతిఘటించి పార్టీ మారుతారా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News