వర్ష కొండ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు..

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని

Update: 2024-08-16 15:07 GMT

దిశ, మెట్ పల్లి/ ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామ రైతులు వర్ష కొండ సబ్ స్టేషన్ ను 100 మంది రైతులు ముట్టడించారు. అక్కడే రెండు గంటల పాటు సబ్ స్టేషన్ లో రైతులు బైటాయించి ట్రాన్స్ కో అధికారులతో గొడవకు దిగారు. గత ఐదు రోజులుగా విద్యుత్ కోతలతో పొలాలు ఎండిపోయి భీటలు వారుతున్నాయని విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇలాంటి విద్యుత్ కోతలు పెడితే ట్రాన్స్ కో అధికారులను గ్రామాల్లో నిర్భందిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కన వుండే గ్రామం 500 మోటార్ లు వుండే కోమటి కొండాపూర్ కు రెండు ఫీడర్ ల ద్వారా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నారని 1500 పైగా మోటార్ లో వుండే మా వర్ష కొండ గ్రామానికి ఒకే ఒక్క ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడం దారుణం అన్నారు.

గత ఐదు రోజుల నుంచి తీవ్ర విద్యుత్ కోతల వల్ల రైతులకు చెందిన 150 మోటార్స్ కాలిపోయాయని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని లేకుంటే మెట్ పల్లి డివిజన్ విధ్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చారించారు. ఇప్పటికయినా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి ఏఈ సతీష్ కు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.


Similar News