ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా..రోజువారీ మార్కెట్‌లో సౌకర్యాల కరువు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో

Update: 2024-10-25 05:34 GMT

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కూరగాయలు అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. గ్రామ పంచాయతీకి ఆదాయ వనరుగా నిలుస్తున్న మార్కెట్ లో తగిన వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. మండలంలో ప్రత్యేక స్థలాలు,ఉన్న షెడ్లు లేక రోడ్లకు ఇరువైపులా తాత్కాలిక డేరాలు వేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేస్తున్నా కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మండలంలోని మొత్తం 21 పంచాయతీలు ఉన్నాయి. మండలంలోని మార్కెట్ ద్వారా గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం టెండర్ ద్వారా లక్షల రూపాయలు వస్తున్న,రైతు లనుమాత్రం పట్టించుకోవడం లేదు.

వారసంత ద్వారా పన్నుల రూపంలో చాలా రూపాయలు ఆదాయం వస్తుంది. ఎన్నో ఏళ్లుగా వారసంతల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నా,గ్రామ పంచా యతీ అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఎండాకాలంలో ఎండకు ఎండుతూ, వర్షాకాలంలోనైతే ఇబ్బందులు చెప్పనలవి కావని వాపోతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో సంతకు తీసుకు వచ్చిన సరుకులు పూర్తిగా వర్షంలో తడిసిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో కొందరు నాయకులు అధికారుల స్వార్థంతో ఉన్న మార్కెట్ యార్డ్ ని మొత్తం కూల్చివేశారు. ఇప్పుడు ఉండడానికి కనీసం నీడ కూడా లేకపోయింది. కూరగాయలు అమ్ముకుంటూ నానా అవస్థలు పడుతున్నాము అని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే కేటీఆర్రూ. 50 లక్షలతో మార్కెట్ యార్డ్ కడతానని గతంలో శిలాఫలకం శంకుస్థాపన కూడా చేశారు. ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో అయినా రైతులకు నీడ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News