కేసీఆర్ ఏలుబడిలో అణగారిన, దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుంది: ఈటల

జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణిని తన నివాసంలో శుక్రవారం... Etela Rajendhar hits out at CM KCR

Update: 2023-02-24 10:15 GMT
కేసీఆర్ ఏలుబడిలో అణగారిన, దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుంది: ఈటల
  • whatsapp icon

దిశ, జగిత్యాల టౌన్: జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణిని తన నివాసంలో శుక్రవారం హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఏలుబడిలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తప్ప అణగారిన, దళిత వర్గాలకు మాత్రమే అన్యాయం జరుగుతుందని ఈటల రాజేందర్ అన్నారు. అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని పొగడడం తప్ప ప్రజా సమస్యలను వినే ప్రసక్తి లేకుండా పోయిందన్నారు. చట్టసభలలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు గౌరవించుకుని ప్రజా సమస్యలను చర్చించుకునే సంస్కారం ఉండేది.. కానీ కేసీఆర్ పాలనలో అది మొత్తానికే కనుమరుగైంది అని అన్నారు.

పవిత్రమైన శాసనసభలను సైతం నీచమైన రాజకీయాలు చేస్తుంటే ఇక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను గడ్డిపరకల వలె తీసేస్తున్నారనడానికి సజీవ సాక్ష్యం జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్ లో కూర్చోవడం తప్ప ప్రజా సమస్యలను చూడకుండా వినకుండా ప్రజా వ్యవస్థ ను భ్రష్టు పట్టిస్తున్నారని ద్వజమెత్తారు. రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మార్వో ఆఫీసులు ఏవీ కూడా పనిచేయట్లేదనీ, కేవలం ఒక్క పోలీస్ వ్యవస్థ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే పని చేస్తున్నాయని, ఇలానే కొనసాగితే రాచరిక పాలన కొనసాగుతుందని.. దీనిని ప్రజలు ఆలోచించాలని కోరారు. భోగ శ్రావణిని భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేయమని కోరుతున్నాం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:   కేసీఆర్‌కు కర్ర కాల్చి వాతపెట్టినట్లు బుద్ధి చెప్పాలి: ఈటల రాజేందర్

Tags:    

Similar News