రైతు రుణమాఫీ పై హర్షం వ్యక్తం చేస్తూ ఎడ్లబండ్ల ర్యాలీ..

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల

Update: 2024-08-16 10:46 GMT

దిశ, సుల్తానాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి హర్షం వ్యక్తం చేస్తూ ఎలిగేడు మండల కేంద్రంలో శుక్రవారం రోజు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ రావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ఎడ్లబండ్ల తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన విధంగా శుక్రవారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతగా మండల కేంద్రంలో రైతులతో కలిసి ఘనంగా ర్యాలీ నిర్వహించామని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని కొంత మంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాకపోతే వాటిని కూడా తొందరలోనే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎలిగేడు మండల రైతులు, రైతు నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News