కాంగ్రెస్ పార్టీ హయాంలో కుల వృత్తులకు పెద్ద పీట.. ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కులవృత్తులకు తగిన న్యాయం చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
దిశ, కొడిమ్యాల : కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కులవృత్తులకు తగిన న్యాయం చేకూరుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం రోజున మండలంలోని కొండాపూర్ గ్రామంలో గల మైసమ్మ చెరువులో మత్స్య కార్మికుల ఆర్థిక బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి నూటికి నూరు శాతం సబ్సిడీ కింద చేప పిల్లల పంపిణీ చేపట్టారని తెలిపారు.
నియోజకవర్గంలోని 93 చెరువులలో సుమారు 11 లక్షల వ్యయంతో, తొమ్మిది లక్షల పదిహేను వేల మూడు రకాల చేప పిల్లలను చెరువులలో పెంచుతామని, అలాగే మత్స్యకారులను ఆదుకోవడానికి వారికి ప్రమాద బీమా ఐదు లక్షలు సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని ప్రభుత్వం కులవృత్తులను ఆదుకోవడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ అధికారి విజయ భారతి, తహశీల్దార్ రమేష్, ఎంపీడీవో స్వరూప, మల్యాల ఏఎంసి వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, నాయకులు నారాయణ గౌడ్, ముత్యం శంకర్, వినోద్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.