Disha Effect : దిశ ఎఫెక్ట్.. వైద్యులను మంజూరు చేసిన కలెక్టర్
ఎట్టకేలకు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు
దిశ, హుజురాబాద్ రూరల్: ఎట్టకేలకు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు వైద్యులను డిప్యుటేషన్ పై జిల్లా కలెక్టర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 13న దిశ పత్రికలో "సర్కారు ఆస్పత్రికి సుస్తీ" అనే కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ పమేల ఉత్పత్తి కరీంనగర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రత్యేక విభాగానికి చెందిన నలుగురు వైద్యులను డిప్యూటేషన్ పై హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి పంపించారు. డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి జనరల్ మెజీషియన్, డాక్టర్ చేకొండి శ్రీనివాస్ ఆర్థో సర్జన్, డాక్టర్ పల్లవి గైనకాలజిస్ట్ ,డాక్టర్ పి రమేష్ డెర్మటాలజిస్ట్ లను డిప్యూటేషన్ పై హుజురాబాద్ ఆసుపత్రికి పంపుతున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు.