మోగొడైతే పంటలు, గొంతులు ఎండకుండా చూడాలి : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి మొగోనివైతే రాష్ట్రంలో పంటలు, గొంతులు ఎండకుండా చూడాలని కేటీఆర్ సీఎం పై ఫైర్ అయ్యారు.

Update: 2024-03-10 14:10 GMT

దిశ, గంభీరావుపేట: సీఎం రేవంత్ రెడ్డి మొగోనివైతే రాష్ట్రంలో పంటలు, గొంతులు ఎండకుండా చూడాలని కేటీఆర్ సీఎం పై ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా మేడిగడ్డ మూడు పిల్లర్లను కూడా రిపేర్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నారు. ఆదివారం గంభీరావుపేట మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హల్‌లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసున మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తొమ్మిది నర్ర ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. అప్పుడే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించామని, చిన్న చిన్న పొరపాట్లు వల్ల అధికారం కోల్పోయామని... అధికారం కోల్పోవడం వల్ల కూడా మంచే జరుగుతుందని వెల్లడించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఫోర్ ట్వంటీ వాగ్దానాలు ఇచ్చి అధికాంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజులు కాకముందే సీఎం రేవంత్ రెడ్డి సతమతమవుతున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు.

కేసీఆర్ మంజూరీ చేసిన రోడ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజాపాలకు ఓటు వేస్తే మనకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. ఇకనుంచి కేసులు, జైళ్లకు బయపడే వాన్ని కాదు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని కేటీఆర్ వెల్లడించారు. పదవులు, రాజకీయం కోసం పార్టీలు మారే నేతలు వదిలేద్దాం.. పార్టీ కోసం ఎలాంటి స్వలాభాలను ఆశించకుండా పని చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి కార్యకర్తల భాగోగులే నాబాగోలుగా చూసుకుంటాని వెల్లడించారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలుపొందేలా పాటుపడాలన్నారు. అలాగే కరీంనగర్‌లో 12వ తేదిన జరిగే కదనభేరీ భహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఆరో తేదీన జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ, నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కార్యకర్తలను కేటీఆర్ కోరారు. అంతకు ముందు తెర్లుమద్దిలో మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ లక్ష్మణ్, సెస్ డైరెక్టర్ నారాయణ రావు, పట్టణ అధ్యక్షులు వెంకట్ యాదవ్ వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News