మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్‌లు

హుజురాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి శనివారం

Update: 2024-09-21 12:47 GMT

దిశ,హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి శనివారం అధికారులు గైర్హాజరు కావడంతో కౌన్సిలర్‌లు సమావేశాన్ని బహిష్కరించారు. గత కొన్ని సమావేశాల నుండి మున్సిపల్ అధికారులు కొందరు సమావేశానికి హాజరు కావడం లేదని, దీనివల్ల పరిపాలన ఇబ్బంది అవుతుందని వారు అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి అందరూ అధికారులు హాజరైనప్పుడే వస్తామని కౌన్సిలర్‌లు కమిషనర్ తో తేల్చి చెప్పారు. దీంతో సర్వసభ్య సమావేశం మరోసారి అధికారులందరూ హాజరయ్యేలా చూసి సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.


Similar News