అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

కోరుట్ల పట్టణంలోని అల్లమయ గుట్ట ప్రాంతంలో ఆదివారం ఉదయం... Cordon search in korutla

Update: 2023-03-19 04:44 GMT

దిశ, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని అల్లమయ గుట్ట ప్రాంతంలో ఆదివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి అధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, సరియైన పత్రాలు, వెహికల్ నెంబర్ లేని 85 ద్విచక్ర వాహనాలు, 8 నాలుగు చక్రాల వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా డీస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించి అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగివుండాలని అన్నారు. ఈ కార్డెన్ సెర్చ్ లో కోరుట్ల, మెట్ పల్లి సీఐలు ప్రవీణ్, లక్ష్మినారాయణ, కోరుట్ల ఎస్సై చిర్ర సతీష్ తోపాటు ఆరుగురు ఎస్సైలు, 100 మంది పోలీసులు పాల్గొన్నారు.



Tags:    

Similar News