జీపీ బిల్డింగ్ తాకట్టుకు యత్నం..మాజీ సర్పంచ్ భర్త నిర్వాకం..

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామపంచాయతీ

Update: 2024-11-13 07:42 GMT

దిశ, మేడిపల్లి : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామపంచాయతీ భ‌వ‌నాన్ని మాజీ సర్పంచ్ భర్త తాకట్టు పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. మాజీ సర్పంచ్ భర్త కాంట్రాక్ట‌ర్ అయిన మామిడి ధ‌ర్మారెడ్డి పై గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత 353(2) సెక్ష‌న్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామ పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు తీసుకున్నప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని కావాలనే బ్యాంకు అధికారులను కాంట్రాక్టర్ సంప్రదించినట్లు కార్యదర్శి శ్యామల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మండలంలో ఉన్న ఇతర గ్రామాల మాజీ సర్పంచ్లను ఇదేవిధంగా తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ మామిడి ధర్మారెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి పోలీసులను కోరారు. అయితే ఏకంగా ప్రభుత్వ ఆస్తి అయిన గ్రామ పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించిన సంఘటన జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.


Similar News