విధులు బహిష్కరించి కెశోరం కార్మికులు నిరసన

కెశోరం యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరి ఆధ్వర్యంలో గురువారం కాంట్రాక్టు కార్మికులు జనరల్ షిఫ్ట్ విధులు బహిష్కరించి కర్మాగారం ముఖ ద్వారం వద్ద నిరసన చేపట్టారు.

Update: 2024-11-14 15:21 GMT

దిశ, రామగుండం : కెశోరం యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక్ హరి ఆధ్వర్యంలో గురువారం కాంట్రాక్టు కార్మికులు జనరల్ షిఫ్ట్ విధులు బహిష్కరించి కర్మాగారం ముఖ ద్వారం వద్ద నిరసన చేపట్టారు. బోనస్ చెల్లింపుపై యాజమాన్యం సమాధానం చెప్పే వరకు విధులు బహిష్కరిస్తామని నాయకులు పేర్కొన్నారు.

    దాంతో కర్మాగారం ప్లాంటెడ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తమకు రెండు రోజులు గడువు కావాలని, సాధ్యం అయినంత మేరకు త్వరగానే బోనస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు విధుల్లోకి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కౌశిక్ హరి, ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, సలహాదారులు పెరుమాండ్ల రమేష్, సతీష్ గౌడ్, తీగల తిరుపతి, పెద్దపల్లి నాగరాజు, సాదిక్ పాషా, సుధాకర్ తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. 


Similar News