జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. బాలింత కడుపులో గుడ్డను వదిలి కుట్లు వేసిన వైద్యులు
జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 నెలల క్రితం డెలివరీ కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలోనే కర్చీఫ్ (కాటన్ గుడ్డ) ఉంచి కుట్లు వేశారు. దీంత సంవత్సరం కాలంగా సదరు మహిళ నరకయాతనను అనుభవిస్తుంది.
]వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ బాలింత డెలివరీ కోసం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నమిలకొండలో గల పుట్టింటికి వచ్చింది. డెలివరీ కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో 29 డిసెంబర్ 2021 రోజున నవ్య శ్రీ అడ్మిట్ అయింది. ఈ క్రమంలో నవ్యశ్రీ కి సర్జరీ చేసిన వైద్యులు ఆపరేషన్ తర్వాత కాటన్ గుడ్డను పొట్ట లోపలే మరిచిపోయి కుట్లు వేశారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నవ్యశ్రీ నెల రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపింది.
దాదాపు రెండేళ్లు గడుస్తున్నా.. కడుపు నొప్పిఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో గల ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా పొట్టలో కాటన్ గుడ్డ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి కాటన్ గుడ్డను తొలగించారు. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన బాధితురాలు బంధువులు జిల్లా కలెక్టర్ కు వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.