సాగునీటి తిప్పలు తీర్చిన అపర భగీరథుడు కేసీఆర్ : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల సాగు నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.

Update: 2023-06-07 13:03 GMT

దిశ, తిమ్మాపూర్ : కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల సాగు నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం అల్గునూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సాగునీటి దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో రైతుల సాగు నీటి కళలు నెరవేరాయని తెలపారు. అదేవిధంగా ప్రజల తాగు నీటి కష్టాలు కూడా తీరాయని అన్నారు.

మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువులను మరమ్మతు చేయడం వల్ల నిండు వేసవిలోనూ గ్రామాల్లోని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 1.27 లక్షల ఎకరాలకు గాను ప్రస్తుతం 1.07లక్షల ఎకరాలకు సాగునీందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో మరో 20వేల ఎకరాలకు కూడా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్, నీటి పారుదల శాఖ ఈ.ఈ పెద్ది రమేష్, కార్పొరేటర్ సల్ల శారద - రవీందర్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, నీటి పారుదల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News