ప్రారంభానికి నోచుకోని ఈ- పంచాయతీ కార్యాలయం..

సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బల్ మెషిన్ నిధుల ద్వారా గత ఏడాది అంచనా వ్యయం పది లక్షల రూపాయలతో ఈ పంచాయతీ కార్యాలయం భవనాన్ని నిర్మాణం పూర్తి చేశారు.

Update: 2023-05-03 10:58 GMT

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బల్ మెషిన్ నిధుల ద్వారా గత ఏడాది అంచనా వ్యయం పది లక్షల రూపాయలతో ఈ పంచాయతీ కార్యాలయం భవనాన్ని నిర్మాణం పూర్తి చేశారు. ఈ పంచాయతీ కార్యాలయం ప్రారంభానికి నోచుకు పోకపోవడంతో ప్రస్తుతం పాత పంచాయతీ కార్యాలయంలోనే గ్రామానికి అవసరమైన పనులు కొనసాగుతున్నాయి.

ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు వర్షాకాలంలో అక్కడక్కడ ఈ భవనంలో వర్షం నీటితో నిండిపోతుంది. తమ అవసరం కోసం కార్యాలయ పనుల కోసం వచ్చే ప్రజలు భవనం పై పెచ్చులు ఎప్పుడు ఊడిపోయి కింద పడతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాలయ ప్రారంభోత్సవం తొందరగా చేయవలసిందిగా రేగడి మద్దికుంట గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News