రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

విష జ్వరాలు విజృంభిస్తున్న కారణంగా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Update: 2024-09-08 12:18 GMT

దిశ, జగిత్యాల టౌన్ : విష జ్వరాలు విజృంభిస్తున్న కారణంగా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లెలు మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగానే విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని మండిపడ్డారు. జ్వరాల పట్ల వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. విష జ్వరాల కారణంగా మరణాల సంభవిస్తున్నాయని పత్రికల్లో వస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం డెంగీ మరణాలు లేవని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

    సారంగాపూర్ సింగిల్‌ విండో సీఈఓ, మల్లాపూర్‌ మండలానికి చెందిన యువకుడు విషజ్వరంతో చనిపోయిన విషయం కాంగ్రెస్ లీడర్లకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ దవాఖానాల్లో గడిచిన మూడు నెలలుగా ఎమర్జెన్సీ మందుల పంపిణీ జరగడంలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన సేవలు అందాయని అన్నారు. ఈ సమావేశం లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News