Kamala Harris : కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి! ఎక్స్‌లో కేటీఆర్‌ ట్వీట్ వైరల్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య తాజాగా బిగ్ డిబేట్ రసవత్తరంగా మారింది.

Update: 2024-09-11 08:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య తాజాగా బిగ్ డిబేట్ రసవత్తరంగా మారింది. వాషింగ్టన్ లోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య జరిగిన తొలి డిబేట్‌ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరు షేక్ హ్యాండ్‌తో చర్చ మొదలు పెట్టి ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

భారత్‌లో కూడా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ డిబేట్‌పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కమలా హారిస్‌‌పై ప్రశంసలు చేస్తూ పోస్ట్ చేశారు. ‘కమలా హారిస్‌ నిజమైన దేశాధ్యక్ష అభ్యర్థి అనిపించింది.. ఈ ఏడాది చివర్లో అమెరికాకు ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేటీఆర్‌ ట్వీట్‌ సైతం వైరల్‌గా మారింది.


Similar News