KTR : రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రక్షణ కవచంగా కమలదళం(BJP) మూసీ పేరుతో డ్రామాలు వేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ట్విటర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2024-11-17 11:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రక్షణ కవచంగా కమలదళం(BJP) మూసీ పేరుతో డ్రామాలు వేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ట్విటర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయమని, వారెవా తోడు దొంగల నాటకమని విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా? లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర? అని ప్రశ్నించారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము అని, రేవంత్ ను మొదట అభినందించింది మీరైతే..

మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము అని చెప్పుకొచ్చారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటని, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసమని నిలదీశారు. రేవంత్ ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలని, లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలని, మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News