Etela Rajendar : రేపు సంగారెడ్డి జైలుకు ఈటల, డీకే అరుణ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల(Lagacharla incident) ఘటన గురించి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల(Lagacharla incident) ఘటన గురించి తెలిసిందే. ఫార్మా కంపెనీలకు భూమి కేటాయించేందుకు వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ప్రభుత్వ అధికారులపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడులు జరిపారు. ఈ ఘటనలో గ్రామంలో పలువురుని అరెస్ట్ చేయగా.. కోర్టు వారికి రిమాండ్ విధించింది. కాగా స్థలాభావంతో 16 మందిని సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. వీరందరిని సోమవారం బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్(Etela Rajendar), డీకే అరుణ(DK Aruna) కలవనున్నారు. రేపు ఉదయం జైలుకు వెళ్ళి 16 మందితో ఎంపీలు మూలాఖత్ అయ్యేందుకు అనుమతులు తీసుకున్నట్టు సమాచారం. బలవంతంగా భూములు లాక్కోవడానికి లగచర్ల గ్రామస్తులను ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసి, భయబ్రాంతులకు గురి చేస్తోందని బీజేపీ నేతలు కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.