Kama Reddy : సైబర్ మోసానికి గురయిన నర్సింగ్ అధికారి

సైబర్ మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి.

Update: 2024-08-11 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ మోసాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. బ్యాంకు అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సైబర్ మోసాలకు ప్రజలు గురవుతన్నారు. తాజాగా.. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండాలో నర్సింగ్‌ అధికారి బి. సంతోష్ సైబర్‌ మోసానికి గురయ్యాడు. తన క్రెడిట్‌ కార్డును అప్‌డేట్‌ చేయాలని వాట్సాప్‌లో పంపిన ఏపీకే ఫైల్‌ను సైబర్ మోసాగాడు డౌన్‌లోడ్‌ చేయించి రూ.67,700 మోసం చేశాడు.

అందిన సమాచారం మేరకు సంతోష్‌కు గుర్తు తెలియని నంబర్ నుండి క్రెడిట్ కార్డ్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని కాల్ వచ్చింది.అది నిజమైన కాల్ అని నమ్మి తనకు వాట్సాప్ ద్వారా పంపిన ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు . ఆ తరువాత క్రెడిట్ కార్డ్ వివరాలను కాల్ లో మోసాగాడికి చెప్పాడు.దీంతో నిన్న సాయంత్రం అతడి ఖాతా నుంచి రూ.67,700 విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన సంతోష్ వెంటనే మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు వివరాలు, OTP ఇతర వ్యక్తిగత వివరాలు తెలియని వ్యక్తులతో షేర్ చేసుకోవద్దని , అపరిచిత వ్యక్తులు పంపించే లింకులతో సహా APK ఫార్మాట్ లో ఉన్న ఫైల్స్ ఓపెన్ చేయకూడదని పోలీసులు ఇది వరకే ఎన్నో సార్లు సూచించారు. అయినా కూడా ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారు  


Similar News