కేసీఆర్, హరీష్ రావు ఒత్తిడి వల్లే కాళేశ్వరం నిర్మాణంలో తప్పిదాలు.. కుండబద్దలు కొట్టిన నరేందర్

టెక్నికల్ అంశాలపై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ పెట్టింది. గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రెండోరోజు విచారణ చేపట్టగా కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు.

Update: 2024-08-22 11:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: టెక్నికల్ అంశాలపై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ పెట్టింది. గురువారం జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రెండోరోజు విచారణ చేపట్టగా కమిషన్ ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్, సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అంశాలను వివరించారు. ప్రాజెక్ట్‌ను ఎల్‌ అండ్‌ టీ నా లేక మీరు డిజైన్ చేశారా? అడిగిన ప్రశ్నకు సెంట్రల్ డిజైన్ రూపొందించిందని తెలిపారు. డిజైన్‌లో ఎల్ అండ్ టీ ఇంజినీర్లు కూడా పాల్గొన్నారని వెల్లడించారు.

డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని, మెయింటినెన్స్ లోపాలే డ్యామేజ్‌కు కారణమని నరేందర్ చెప్పారు. కన్‌స్ట్రక్షన్ జరిగిన ప్రాంతానికి తాను వెళ్లలేదని.. కన్‌స్ట్రక్షన్ అసలు తన పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల విషయంలో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు ఒత్తిడి తెచ్చారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. వాళ్లిద్దరితో పాటు ఉన్నతాధికారులు డిజైన్లు త్వరగా ఆమోదించాలని తమను ఒత్తిడికి గురిచేశారని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే ప్రభుత్వ ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయని వివరించారు.

Tags:    

Similar News