కేఏ పాల్ భద్రతపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి హైకోర్టు ఆర్డర్!
తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాసిన లెటర్‌ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తన భద్రతను ప్రభుత్వం తొలగించిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాసిన లెటర్‌ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై గురవారం విచారణ చేపట్టింది. 30 రోజుల్లోగా కేఏ పాల్‌కు ఉన్న థ్రెట్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. వాదనల సందర్భంగా సచివాలయం ఫైర్ యాక్సిడెంట్ ఘటనను కేఏ పాల్ ప్రస్తావించగా ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా జీపీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలంలో అగ్నిప్రమాదం జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఘటన జరిగి వారం రోజులు గడిచినా ప్రమాదంపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
పాత సచివాలయం నుంచి పది మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారని, రూ.500 కోట్ల భవనాన్ని కేవలం వాస్తు పేరుతో కూల్చేశారని కొత్త సచివాలయం పేరుతో రూ.660 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. సచివాలయం ప్రమాదంపై సీబీఐతో విచారణకు ఆదేశించాలని పాల్ వాదించగా కేవలం తన భద్రతపైనే వాదించాలని, ఇతర అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని చీఫ్ జస్టిస్ సూచించారు. ఈ సందర్భంగా పాల్ భద్రతపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీకి ఆదేశిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.
ఇవి కూడా చదవండి:
MLA రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం.. రన్నింగ్‌లోనే ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ కార్ టైర్