రేవంత్ రెడ్డిపై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రగతిభవన్‌ను తగుల బెట్టాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెను దమారమే రేగుతున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రగతిభవన్‌ను తగుల బెట్టాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెను దమారమే రేగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సైతం స్పందించారు. అంతేకాదు, ఏకంగా రేవంత్‌పై డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి భూ కబ్జాలు చేసి ఈ స్థాయికి వచ్చాడని టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రగతిభవన్‌ను తగలాబెట్టాలన్న రేవంత్‌పై డీజీపీని కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగందన్నారు. ఓటుకి నోటు కేసులో దొరికి ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడని ఆరోపించారు.
ఈ మేరకు రేవంత్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, రేవంత్ ప్రజల కోసం పోరాడటం లేదన్నారు. ఇక, విపక్ష నేతతో పాటు సీఎం కేసీఆర్‌ను సైతం పాల్ విమర్శించారు. రూ.500 కోట్లతో పాత సెక్రేరియట్ కూలగొట్టి రూ.610 కోట్లు పెట్టి కొత్తది కట్టి డబ్బులు వేస్ట్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్‌ను అంబేద్కర్ జయంతి రోజున ఓపెన్ చెయ్యాలని కోర్టులో పిల్ వేసినట్లు గుర్తుచేశారు. అగ్నిప్రమాదంపై సైతం సీబీఐకి కంప్లైంట్ ఇచ్చానని.. సెంట్రల్ మినిస్టర్‌లకు చెప్పినట్లు తెలిపారు. మరోవైపు, రేవంత్‌రెడ్డి ఒక జూనియర్ ఆయనకు ఈ పదవి తొలగించి సీనియర్ నాయకులు ఉన్నారు వారికి ఇవ్వాలన్నారు. బడుగు బలహీనర్గాలకు పీసీసీ పదవి ఇవ్వాలని కోరారు.