KA Paul: 500 కార్లతో ప్రజాధనం వృధా: కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌పై కేఏ పాల్ ఫైర్

తెలంగాణలో లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, తెలంగాణను దేవుడే కాపాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తంచేశారు.

Update: 2023-06-26 10:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, తెలంగాణను దేవుడే కాపాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ సోమవారం 500 కార్లలో ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్రకు వెళ్లారని, పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నాలుగు వేల కార్లతో ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. గతంలో దివంగత నేత వైఎస్ఆర్ సైతం ఐదు కార్లలో వెళ్లేవారని గుర్తుచేశారు. నేడు ఏ సీఎం కూడా అన్నికార్లలో వెళ్లరని చెప్పారు. ప్రజలు తనతో చేతులు కలిపి రాబోయే వంద రోజుల్లో తెలంగాణను రక్షించుకుందామని, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అవినీతి పాలన నుంచి బయటపడాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.

Also Read..

రాహుల్‌‌తో పొంగులేటి, జూపల్లి భేటీ.. ఆ రోజే లాంఛనంగా కాంగ్రెస్‌లో జాయినింగ్..! 

Tags:    

Similar News