కాంగ్రెస్‌లో చేరిన కేకే.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా!

బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కె. కేశవరావు బుధవారం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Update: 2024-07-04 07:35 GMT

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కె. కేశవరావు బుధవారం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే తాను కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కానీ ఇన్ని రోజుల తర్వాత అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్ లో అధికారికంగా చేరారు. అయితే ఈ రోజు ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ కర్ ఆపాయింట్మెంట్ కోరారు. మరికొద్ది సేపట్లో కేకే రాజ్యసభ చైర్మన్ ను కలిసి తన రాజీనామా ను అందించనున్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పార్టీ మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News