కాళేశ్వరం ఎంక్వైరీలో మరో కీలక పరిణామం.. Justice P C Ghose కమిషన్ పదవీకాలం పొడిగింపు

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలపై ఎంక్వయిరీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంతోని జ్యుడిషియల్ కమిషన్ పదవీకాలాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఇరిగేషన్ డిపార్టుమెంటు సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Update: 2024-06-29 09:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణాలపై వచ్చిన ఆరోపణలు, అవకతవకలపై ఎంక్వయిరీ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంతోని జ్యుడిషియల్ కమిషన్ పదవీకాలాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ఇరిగేషన్ డిపార్టుమెంటు సెక్రటరీ రాహుల్‌బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ మార్చి 14న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పదవీకాలం జూన్ 30తో ముగుస్తున్నది. కానీ ఎంక్వయిరీ ప్రాసెస్ ఇంకా పూర్తికాకపోవడంతో మరో రెండు నెలల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే కమిషన్‌ ముందు హాజరైన పలువురు అభిప్రాయాలను వెల్లడించి వాటికి తగిన ఆధారాలను జోడిస్తూ అఫిడవిట్లను సమర్పించారు.

ఇప్పటివరకు దాదాపు 50కు పైగా అఫిడవిట్లు అందాయి. వాటిని పరిశీలించిన తర్వాత ఓపెన్ హౌజ్ డిస్కషన్, క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నది. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అవసరమైతే రాజకీయ నాయకులను కూడా పిలవాల్సి వస్తుందని గతంలో జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించడంతో వచ్చే వారం నుంచి ఊపందుకోనున్న ఎంక్వయిరీ ప్రక్రియలో ఎవరికి నోటీసులు జారీ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. కమిషన్ పదవీకాలం రెండు నెలల పాటు పొడిగించడంతో అప్పటికల్లా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే దిశగా కార్యాచరణ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.


Similar News