మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ సీరియస్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణం అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

Update: 2024-10-03 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ హీరో నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణం అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అలాగే ఆమె ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అందులో.."కొండా సురేఖ గారూ.. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను గౌరవించాలి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యం పూరితంగా విసురుతున్న నిరాధారమైన ప్రకటనలు చూసి నిరుత్సాహంగా ఉంది. ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం ఊరుకోం. మనం దీని కంటే పైకి ఎదగాలి, ఒకరి సరిహద్దుల పట్ల మరొకరు గౌరవాన్ని కొనసాగించాలి. ప్రజాస్వామ్య భారతదేశంలో మన సమాజం అటువంటి నిర్లక్ష్య ప్రవర్తనను సాధారణీకరించకుండా చూసుకుందాం." అని రాసుకొచ్చారు.

కాగా మంత్రి కొండా సురేఖ బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగచైతన్య సమంత విడాకులు వంద శాతం కేటీఆర్ కారణంగా జరిగాయంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చొద్దంటే సమంతను నా దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగార్జున ఫ్యామిలి ఒత్తిడి చేశారని. సమంత కేటీఆర్ వద్దకు వెళ్ళనని నిరాకరించడంతో.. తాము చెప్పింది వినకపోతే ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారంటూ.. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.


Similar News