జర్నలిస్ట్ రంజిత్‌కు సర్జరీ పూర్తి.. స్టీల్ ప్లేట్‌ను అమర్చిన వైద్యులు

మంచు ఫ్యామిలి వివాదం(The Manchu Family Controversy)పై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన ప్రముఖ టీవీ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-12-12 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలి వివాదం(The Manchu Family Controversy)పై రిపోర్టింగ్ చేయడానికి వెళ్లిన ప్రముఖ టీవీ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిలో గాయపడిన జర్నలిస్టుకు ఈ రోజు యశోద ఆస్పత్రి(Yashoda Hospital) వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేశారు. మైక్ తో రంజిత్(Ranjeet) తలపై బలంగా కొట్టారు. దీంతో కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో ఫ్రాక్చర్లు అయ్యాయి. మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు రంజిత్‌ జైగోమాటిక్ బోన్‌ను సరిచేశారు. ఫ్రాక్చర్లు అయిన చోట సర్జరీ చేసి.. స్టీల్ ప్లేట్ అమర్చినట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను అబ్జర్వేషన్ ఉంచామని తెలిపారు. ఇదిలా ఉంటే యాక్టర్ మోహన్ బాబు.. జర్నలిస్టుపై దాడి చేసినందుకు బుధవారం మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. మోహన్ బాబుపై BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 


Similar News