Johnny Master: జానీ మాస్టర్ అరెస్ట్.. గోవాలో అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు

ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ పోలీసులు గురువారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-09-19 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళా డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ (Choreographer Johnny Master)ను సైబరాబాద్ ఎస్‌ఓటీ (Cyberabad SOT) పోలీసులు గురువారం గోవా (Goa)లో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌ (Hyderabad)కు తీసుకొచ్చి నేడు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరు (Nellore)కు పారిపోయాడని, నార్త్ ఇండియా స్టేట్స్‌కు వెళ్లాడని, హైదరాబాద్ నగరంలోనే ఓ స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆయనను వెతికేందుకు మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ.. ఇవాళ సైబరా‌బాద్ ఎస్‌ఓటీ పోలీసులు జానీ మాస్టర్‌ను గోవా (Goa)లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతోనే ఆయన గతంలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్లుగా తెలుస్తోంది.

కాగా, తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా డాన్సర్ ఇటీవలే రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆరోపించింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో ఇతర నగరాల్లో అవుట్‌ డోర్‌లో షూటింగ్  చేస్తున్న సమయంలో, అదేవిధంగా నార్సింగి (Narsingi)లోని తన నివాసంలో కూడా తనపై జానీ మాస్టర్ (Johnny Master) పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు పోక్సో (Poxo) కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బాధితురాలి పూర్తి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. తాజాగా, జానీ మాస్టర్ ఆచూకీ లభించడంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వనున్నారు. 

Read More..

జానీ మాస్టర్ పై కరాటే కళ్యాణి ఫైర్.. అలాంటి వాడిని అస్సలు వదలొద్దు అంటూ సంచలన కామెంట్స్ 


Similar News