జేఎల్ఎం, ఏఈ పరీక్ష ఫలితాలు విడుదల
ఉద్యోగ అభ్యర్థులకు టీఎస్ఎస్పీడీసీఎల్ కీలక అప్డేట్ ఇచ్చింది. జేఎల్ఎం(జూనియర్ లైన్‌మెన్), ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)) రాత పరీక్షల ఫలితాలను ప్రకటించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఉద్యోగ అభ్యర్థులకు టీఎస్ఎస్పీడీసీఎల్ కీలక అప్డేట్ ఇచ్చింది. జేఎల్ఎం(జూనియర్ లైన్‌మెన్), ఏఈ(అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)) రాత పరీక్షల ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1601 ఉద్యోగాల భర్తీకి టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 1,553 జేఎల్‌ఎం, 48 ఏఈ పోస్టులు ఉన్నాయి. అయితే, ఏప్రిల్ 30న ఈ పరీక్షలు నిర్వహించగా.. నెల రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం గమనార్హం. https://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
కాగా, గతంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రద్దైన సంగతి తెలిసిందే. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, ఇతరులు డబ్బులు వసూలు చేసి కొంతమంది అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేసి ఏప్రిల్ 30వ తేదీన పరీక్షలు నిర్వహించింది.