Jitender Reddy: తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జితేందర్ రెడ్డి
తెలంగాణ ఒలింపిక్ సంఘం (Telangana Olympic Association) అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడా శాఖ సలహదారు జితేందర్ రెడ్డి (Jitender Reddy) ఘన విజయం సాధించారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఒలింపిక్ సంఘం (Telangana Olympic Association) అధ్యక్షుడిగా మాజీ ఎంపీ, ప్రభుత్వ క్రీడా శాఖ సలహదారు జితేందర్ రెడ్డి (Jitender Reddy) ఘన విజయం సాధించారు. నవంబర్ 21న జరిగిన తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో ప్రెసిడెంట్ పోస్ట్‌కు గాను జితేందర్ రెడ్డితో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్ (Chamundeshwari Nath) నామినేషన్ దాఖలు చేశారు. పోలింగ్ సందర్భంగా అసోసియేషన్‌లో మొత్తం 68 మంది సభ్యులు ఉండగా మొత్తం 59 ఓట్లు పోల్ అయ్యాయి. తాజాగా, వెలువడిన ఫలితాల్లో ప్రత్యర్థి చాముండేశ్వరి నాథ్ (Chamundeshwari Nath)పై జితేందర్ రెడ్డి (Jitender Reddy) 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జితేందర్ రెడ్డికి 43 ఓట్లు రాగా.. చాముండేశ్వరినాథ్‌కు కేవలం 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు తెలంగాణ ఒలింపిక్ సంఘం సెక్రటరీగా మల్లారెడ్డి (Malla Reddy) విజయం సాధించారు.